హాలియా, వెలుగు : కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన15 రోజుల శిక్షణలో భాగంగా శ్రీలంకకు చెందిన 30 మంది మీడియా ప్రతినిధులు శుక్రవారం నాగార్జునసాగర్‌ను సందర్శించారు. విజయ విహార్ వద్ద శ్రీలంక మీడియా ప్రతినిధులకు మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు, నల్గొండ జిల్లా సమాచారశాఖ సహాయ సంచాలకుడు వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా బృందం సభ్యులు బుద్ధవనం, నాగార్జునకొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు తదితర ప్రదేశాలను వారు సందర్శించారు. బుద్ధవనం గైడ్ సత్యనారాయణ సాగర్చరిత్ర విశేషాలను పాత్రికేయులకు వివరించారు.