హైదరాబాద్​ : వర్షం అరగంట పడింది.. అల్ల కల్లోలం సృష్టించింది..

హైదరాబాద్​ : వర్షం  అరగంట పడింది.. అల్ల కల్లోలం సృష్టించింది..

హైదరాబాద్​ లో చినుకు పడితే చాలు చిత్తడి చిత్తడే.. రోడ్డుపై వరద నీరు ప్రవహించడం .. మ్యాన్​ హోల్స్​ ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి.. ఇక ట్రాఫిక్​ కష్టాలు చెప్పనక్కరలేదు.  ఈ రోజు ( ఏప్రిల్​ 3)  మధ్యాహ్నం అరగంట పాటు గాలి వానతో కూడిన భారీ వర్షానికి ఖైరతాబాద్ నుండి  పంజాగుట్ట వైపు వెళ్లే రహదారిపై ఓ భారీ వృక్షం కూలి కారుపై పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి  ప్రాణాపాయం జరగలేదు ..  కాని..  ఖైరతాబాద్..  పంజాగుట్ట రహదారి పై  కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలానికి  ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జోయల్ డేవిడ్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.  వృక్షాన్ని తొలగించే పనులు డిఆర్ఎస్ బృందం  వేగవంతంగా చెట్టును కట్ చేసి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.

Also Read : పంజాగుట్ట ఫ్లైఓవర్​ పై వరద నీరు

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారా యణ గూడ, లక్డీకాపుల్ ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరుతో వాహనదారులు, బాట సారులు ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ వాహనాలు స్థంభించాయి. 

పలు చోట్ల ఈదురు గాలు లకు చెట్లు నెలకొరిగాయి. దీంతో ట్రాఫిక్​కు అంతరా యం ఏర్పడింది.  మరో నాలుగు రోజుల పాటు ( ఏప్రిల్​ 3 నుంచి )  వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఒక్కసారిగా కురిసిన వర్షానికి రహదారులన్ని జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపోవడంతో పాటు ట్రాఫిక్​కు​ అంతరాయం ఏర్పడింది.