డొంక కదిలింది : డ్రగ్స్ కేసులో మరో 30 మంది హైదరాబాద్ VIPలు..

డొంక కదిలింది : డ్రగ్స్ కేసులో మరో 30 మంది హైదరాబాద్ VIPలు..

హైదరాబాద్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. డ్రగ్స్ సరఫరా చేస్తూ ఇటీవల దొరికిన అమన్ విచారణలో హైదరాబాద్ సిటీలోని వీఐపీల డ్రగ్స్ బాగోతం బయటపడింది. ఇదే కేసులో ఇప్పటికే ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అరెస్ట్ అయిన విషయం తెలిసింది. రకుల్ సోదరుడు అమన్ విచారణలో.. హైదరాబాద్ సిటీ కేంద్రంగా వివిధ కంపెనీలు పెట్టి.. పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న ప్రముఖులు ఉన్నట్లు బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే వాళ్లందరికీ.. డ్రగ్స్ వినియోగంపై నోటీసులు ఇవ్వటానికి రెడీ అవుతున్నారు పోలీసులు.

విచారణలో మరో 30 మంది వీఐపీలు డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించారు పోలీసులు.  ప్రముఖ కంపెనీల యజమానులు డ్రగ్స్ వినియోగదారులుగా గుర్తించారు. 30 మంది వీఐపీలకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. అమన్ని పట్టుకున్నప్పుడే 19 మంది వీఐపీలను గుర్తించి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇప్పటి వరకు ఈ  కేసులో 50 మంది వీఐపీలు డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారించారు. వారి పేర్లను కాన్ఫిడెన్షియల్ గా ఉంచింది పోలీసు యంత్రాంగం.