
నారాయణ్ ఖేడ్, వెలుగు: పాదుక పూజకు వచ్చిన భక్తులపై టెంట్లు కూలి 30 మంది గాయపడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సిర్గాపూర్ మండలం వాసర్ లో సోమవారం నరేంద్ర చార్య మహారాజ్ పాదుకా దర్శనం, దివ్య ప్రవచన కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి భక్తులు అధికంగా తరలివచ్చారు. కార్యక్రమం కొనసాగుతుండగా గాలి దుమారం బీభత్సం సృష్టించగా టెంట్లు కూలిపోయాయి. వాటి కింద దాదాపు30 మంది భక్తులు ఉండిపోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాధితులను వెంటనే నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందడంతో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి
కోల్ ఇండియా స్థాయి పోటీల్లో సింగరేణి క్రీడాకారులు పాల్గొని బాడీ బిల్డింగ్, వెయిట్‌లిఫ్టింగ్, కబడ్డీ, పవర్ లిఫ్టింగ్, కల్చరల్ఈవెంట్స్తో పాటు పలు పోటీల్లో మెడల్స్గెలుపొందేవారు. కానీ క్రీడలకు యాజమాన్యం తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో క్రీడాకారులు ఆసక్తి చూపడంలేదు. కేవలం టైంపాస్‌గా పాల్గొనకుండా స్పోర్ట్స్షూస్, దుస్తులు ఇచ్చి ప్రాక్టీస్చేయిస్తుండాలి. మిర్యాల రంగయ్య, గుర్తింపు సంఘం అదనపు ప్రధాన కార్యదర్శి
స్పోర్ట్స్ఆఫీసర్ను నియమించాలి
సింగరేణి సంస్థలో పూర్తి స్థాయి స్పోర్ట్స్ఆఫీసర్ లేకపోవడం విచారకరం. స్పోర్ట్స్సూపర్ వైజర్లకు ప్రమోషన్స్ఇవ్వాలి. పెండింగ్‌లో ఉన్న షూస్, క్రీడా దుస్తులను వెంటనే ఇచ్చే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి.
- ఎండీ. రజాక్, ప్రాతినిధ్య సంఘం వైస్ ప్రెసిడెంట్