బడ్జెట్​లో విద్యారంగానికి 30 శాతం నిధులుకేటాయించాలి

బడ్జెట్​లో విద్యారంగానికి 30 శాతం నిధులుకేటాయించాలి
  • గవర్నర్​కు ఎమ్మెల్సీమల్క కొమరయ్య విజ్ఞప్తి  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, టీచర్ల పెండింగ్​సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కరీంనగర్– ​ మెదక్ –​ నిజామాబాద్–​ ఆదిలాబాద్​ టీచర్స్​ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గవర్నర్ ను కోరారు. కోఠారి కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత  సోమవారం రాజ్ భవన్​లో గవర్నర్​ జిష్ణుదేవ్ వర్మను కొమరయ్య కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ ను సన్మానించి, జ్ఞాపికను అందించారు. అనంతరం విద్యారంగ, టీచర్ల సమస్యల పరిష్కారం కోసం గవర్నర్​కు వినతిపత్రం ఇచ్చారు. మల్క కొమరయ్య మాట్లాడుతూ.. డీఎస్సీ–2003లో టీచర్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో57 ప్రకారం పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ గడువు ముగిసి 20 నెలలు అయిందని, వెంటనే మెరుగైన ఫిట్ మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలని కోరారు