‘లాక్ డౌన్ ’ వల్ల ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో సర్వీస్ ప్రొవైడర్లపై భారం పడకుండా ఉండేందుకు చాలా స్ట్రీమింగ్, సోషల్ మీడియా యాప్స్ తమ క్వాలిటీని తగ్గించాయి. యూట్యూబ్ యాప్‌లో వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీని తగ్గించారు. తక్కువ క్వాలి టీతోనే యూట్యూబ్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు కూడా వీడియో క్వాలిటీ తగ్గించాయి.
వాట్సాప్‌లో స్టేటస్ కూడా 30 సెకండ్ల నుంచి 15 సెకండ్లకు తగ్గించారు. ప్రస్తుతం లాక్ డౌన్ ప్రభావం తగ్గడంతో ఈ పద్ధతిలో మార్పు వచ్చింది. ఇప్పటికే ‘వాట్సాప్’లో ముప్పై సెకండ్ల స్టేటస్ అందుబాటులోకి వచ్చింది. ‘నెట్‌ఫ్లిక్ స్ ’ కూడా హెచ్ డి వీడియోల్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలోనే స్ట్రీమింగ్ క్వాలిటీని ‘నెట్‌ఫ్లిక్స్ ’ పెంచబోతున్నట్లు చెప్పింది.