బాక్సింగ్‌‌‌‌ డే టెస్టుకు 30వేల మంది ఫ్యాన్స్‌‌‌‌

మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌: ఇండియా–ఆస్ట్రేలియా మధ్య  జరిగే ఐకానిక్‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌ డే టెస్టుకు రోజుకు  30 వేల మంది అభిమానులు హాజరుకానున్నారు. ఇందుకోసం విక్టోరియా గవర్నమెంట్‌‌‌‌ క్రౌడ్‌‌‌‌ రిస్ట్రిక్షన్స్‌‌‌‌ను సడలించింది. నాలుగు టెస్టుల సిరీస్‌‌‌‌లో భాగంగా మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో ఈ నెల 26–30వ తేదీల మధ్య  బాక్సింగ్‌‌‌‌ డే టెస్టు (సెకండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌)జరగనుంది. స్టేడియం కెపాసిటీలో 25 శాతం అంటే రోజుకు 25 వేల మంది అభిమానులకు విక్టోరియా  ప్రభుత్వం తొలుత అనుమతి ఇచ్చిం ది. అయితే, గత 40 రోజులుగా తమ స్టేట్‌‌‌‌లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో గవర్నమెంట్‌‌‌‌ నిబంధనలు సడలించింది. దాంతో, ఈ పోరుకు మరో ఐదువేల మంది ఫ్యాన్స్‌‌‌‌ హాజరయ్యేందుకు గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ లభించిందని క్రికెట్‌‌‌‌ ఆస్ట్రేలియా చెప్పింది.

For More News..

ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ సుప్రీంకోర్టుకు ట్రంప్

మొతెరాలో డే అండ్ నైట్‌ టెస్ట్‌

క్రికెట్‌‌కు గుడ్‌‌బై చెప్పిన పార్థివ్‌‌కు సూపర్ ఆఫర్