
నిర్మల్ జిల్లాలో ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యానికి సుమారు 30 వేలకు పైగా మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి.. జిల్లాలోని కడెం మండలం ఉడుంపూర్ రేంజ్ పరిధిలోని రాంపూర్ బీట్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. నాలుగు రోజుల క్రితం పునరావాస కాలనీలో ఉన్న ప్లాంటేషన్ బేస్ లో అగ్గి రాజుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన పట్ల ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో సుమారు 30 వేలకు పైగా మొక్కలు బూడిద పాలయ్యాయి.
లక్షలు విలువజేసే మొక్కలు అగ్నికి ఆహుతవుతున్నా కూడా పట్టించుకోలేదు అటవీ అధికారులు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్లాంటేషన్ వృథా అవుతోందంటూ మండిపడుతున్నారు స్థానికులు. ఘటనకు బాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.
Also Read:-తిరిగి కట్టక్కర్లేని లోన్.. 50వేలకు 100% సబ్సిడీ.. దరఖాస్తు గడువు పొడిగింపు