గ్రేటర్ పరిధిలో ఆరు జోన్లు, 30 సర్కిల్ లు ఉన్నాయి. కోటి 20 లక్షల మందికి పైగా జనాభా కలిగిన నగరంలో ఎప్పటికప్పుడు హోటళ్లు,రెస్టారెం ట్లు పుట్టగొడుగుల్లా పుట్టు కొస్తున్నాయి. జీహెచ్ఎంసీ అంచనా ప్రకారం సిటీలో 25,000 హోటళ్లు, రెస్టారెం ట్లు, మరో 5 వేల చిన్న హోటళ్లు ఉన్నాయి. వీటిలో ఎలాంటి ఆహారం సప్లై చేస్తున్నారు అనే విషయం తనిఖీ చేయడానికి దాదాపు30 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్ లు ఉండాలి.కానీ ప్రస్తుతం అందుబాటులో ఉంది కేవలం ముగ్గురే . దీన్ని బట్టి హోటళ్లు, రెస్టారెం ట్లలో తనిఖీలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసిన, ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన ఆహారాన్ని తిం టూ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఎక్కడో ఒకచోట ఫిర్యాదు అందిన అప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేసి ఫైన్ విధిస్తూ చేతులు దులుపుకుంటు న్నారు. రెగ్యులర్ గా తనిఖీలు చేసి ఆహారం కల్తీ కాకుండా చూడాల్సి న బాధ్యతను మర్చిపోతున్నారు. అధికారుల తనిఖీలు లేకపోవడంతో కొన్ని హోటళ్లు,రెస్టారెం ట్ల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఉన్న ముగ్గురు అధికారులు ఎన్నికలు, పన్ను వసూలు వంటి సమయాల్లో బిజీగా ఉంటున్నారు.
వసూలుపై ఫోకస్.. నో చెకింగ్…..
జీహెచ్ఎంసీకి రోజూ ఒక్కో సర్కిల్ నుంచి నాలుగైదు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలా గ్రేటర్ పరిధిలో దాదాపు100కు పైగా ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిలో ఐదారు చోట్ల తప్ప మిగతా చోట్లకు అధికారులు వెళ్లి తనిఖీ చేయలేని పరిస్థితి. ఉన్న ముగ్గురు అధికారులే ప్రతి బుధవారం కోర్టు కేసులకు హాజరు కావాల్సి ఉంటుం ది. పరిపాలనా పరమైన విధులు నిర్వహించాలి. పని ఒత్తిడి కారణంగా ఆహార తనిఖీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఆహార తనిఖీ విషయంపై ఓ అధికారిని సంప్రదించగా ‘‘ఉన్న ముగ్గురం శక్తివంచన లేకుండా తనిఖీలు నిర్వహిస్తున్నాం .. తొందరగా ఫుడ్ ఇన్స్పెక్టర్లను నియమిస్తే వర్క్ బర్డెన్ తగ్గుతుం దని చెప్పా రు.’’ హోటల్లు రెస్టారెం ట్లకు అనుమతులు ఇచ్చి ప్రాపర్టీ టాక్స్ వసూలు చేసుకోవడంపై ఆసక్తి చూపుతున్న జీహెచ్ఎంసీ అధికారులు.. ప్రజలు ఏం తింటు న్నారు,హోటళ్లు ఎలాంటి ఫుడ్ పెడుతున్నాయి అనే విషయాన్ని మాత్రం పట్టిం చుకోవడం లేదు.
26 మంది ఏరి?…..
గతేడాది ప్రభుత్వం జీహెచ్ఎంసీకి కొత్తగా 26 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లను నియమిస్తామని చెప్పింది. ఆ ప్రతిపాదన అటకెక్కింది. జీహెచ్ఎంసీ నుంచి కూడా ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత, ప్రజారోగ్యం పై రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది. గతేడాది అన్ని రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులతో సమావేశం నిర్వహించింది. ఫుడ్ సేఫ్టీపై అవగాహన, తనిఖీలు నిర్వహించాలని పేర్కొంది. నేషనల్ హెల్త్ స్కీమ్ ద్వారా వచ్చే నిధులను ఇందుకోసం వెచ్చిం చాలని సూచించిం ది. కానీ సిటీలో అలాంటి కార్యక్రమాలు ఎక్కడా జరగడం లేదు. ఎప్పుడో ఒకసారి ఉన్నతాధికారులు పర్యటించి అపరిశుభ్ర వాతావరణం, కల్తీ ఆహారం గుర్తించి, ఆయా హోటళ్లకు ఫైన్ విధిస్తున్నారు. సిటీలో ఆరు జోన్లు ఉంటే కేవలం సెంట్రల్ జోన్ లో మాత్రమే అడపాదడపా అధికారులు హడావుడి చేస్తున్నారు. మిగిలిన చోట్ల తీవ్రమైన ఫిర్యాదులు అందితేగాని పట్టిం చుకోవడం లేదు.
కంపోస్టులు ఉండవ్….
కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వంద కేజీల కంటే ఎక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేసే హోటళ్లు, వాణిజ్య సంస్థలు సొంతంగా కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలి. కానీ సిటీలో హోటళ్లు నిబంధనలు పాటించడం లేదు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన కిచెన్ లను గుర్తిస్తున్నారు. వాటి కి ఫైన్ వేసి వదిలేస్తున్నారు. పెద్ద పెద్ద హోటళ్లలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగిలిన హోటళ్ల సంగతి చెప్పాల్సి న అవసరం లేదు.