- వరల్డ్ రికార్డ్ ఈవెంట్లో శ్రీచైతన్య స్టూడెంట్ల ప్రతిభ
హైదరాబాద్, వెలుగు: శ్రీచైతన్య విద్యాసంస్థల స్టూడెంట్స్ మరో మైలురాయిని అధిగమించారు. బుధవారం నిర్వహించిన సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్లో 3 గంటల్లో 600 మ్యాథ్స్ ఫార్ములాలు ఏకకాలంలో చెప్పి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈవెంట్లో 20 రాష్ట్రాల నుంచి 10 వేల మంది శ్రీచైతన్య విద్యార్థులు పాల్గొనగా.. అందరూ 3 నుంచి 10 ఏండ్ల వయసున్నవారే కావడం విశేషం. ప్రతిభ కనపరిచిన చిన్నారులకు యూకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు అభినందనలు తెలియజేసి, ప్రశంసా పత్రాలు అందజేశారు. శ్రీచైతన్య విద్యాసంస్థకు సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ పతకాన్ని ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా శ్రీచైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ మాట్లాడుతూ..శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులు సాధించిన సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ ఘనత విద్యారంగ చరిత్రలో అద్భుతఘట్టమన్నారు. ఇది తమ అధ్యాపకుల శిక్షణకు నిదర్శనమని తెలిపారు. ఈ ఏడాది సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ శ్రీచైతన్య విద్యార్థులు సాధించినందుకు గర్వపడుతున్నమని చెప్పారు.