
- ఏపీ నుంచి పుణెకు తరలిస్తుండగాఅబ్దుల్లాపూర్మెట్ వద్ద పట్టివేత
దిల్ సుఖ్ నగర్, వెలుగు: స్క్రాప్మెటీరియల్కంటైనర్లో గంజాయిని తరలిస్తుండగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్పోలీసులు, మహేశ్వరం ఎస్ఓటీ జోన్‌పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ ను అరెస్ట్‌చేసి.. రూ.1.05 కోట్ల విలువ చేసే 300 కిలోల గంజాయిని, టాటా కంటైనర్ వెహికల్ ను సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం కమిషనర్సుధీర్ బాబు వెల్లడించారు. మహారాష్ట్రలోని పుణె, రూపినగర్కు చెందిన అహ్మద్ గులాబ్ షేక్(56) డ్రైవర్ పనిచేస్తున్నాడు. అతనికి పుణెలో డ్రగ్స్ సప్లై చేసే వైభవ్, దేవాతో పరిచయం ఏర్పడింది.
ఏపీలోని విశాఖపట్నం నుంచి పూణె, ఇతర ప్రదేశాలకు గంజాయిని రవాణా చేస్తే ఒక్కో కంటైనర్ (లోడ్)కు రూ. 3 లక్షల ఇస్తామని అహ్మద్ గులాబ్ షేక్ కు వైభవ్, దేవా ఆఫర్ ఇచ్చారు. వైభవ్, దేవా సూచనల మేరకు అహ్మద్ గులాబ్ షేక్ విశాఖపట్నం వెళ్లి అక్కడ స్థానిక వ్యక్తి అయిన బుజ్జిబాబు దగ్గర నుంచి 300 కిలోల గంజాయి (138 ప్యాకెట్లు) సేకరించి హైదరాబాద్ మీదుకు పుణెకు బయలుదేరాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ మహేశ్వరం జోన్ పోలీసులు, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు.. గురువారం రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర తనిఖీలు చేపట్టారు. టాటా కంటైనర్ వెహికల్ ఆపి సెర్చ్ చేయగా.. 300 కిలోల గంజాయి పట్టుబడింది. వెంటనే నిందితుడిని అధికారులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.