
హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ వీకెండ్లో నిర్వహించిన స్పెషల్డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో 300 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన వాహనాల్లో 231 టూ-వీలర్లు, 8 త్రీ- వీలర్లు, 58 ఫోర్ -వీలర్లు, 3 హెవీ వెహికల్స్ ఉన్నాయి.
62 మందికి 101–150 మధ్య , 25 మందికి 151–200 మధ్య, 17 మందికి 201–300 మధ్య, మరో ఐదుగురికి ఏకంగా 300–500కు పైగా ఆల్కహాల్రీడింగ్ వచ్చింది. వీరిలో 200 మంది 21–40 ఏండ్ల మధ్య ఉండగా, అందరినీ కోర్టు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.