మహదేవపూర్,వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రం లో ఆదివారం రెండు డీసీఎంలలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మహదేవపూర్ డీటీ కృష్ణ వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా నుంచి మహారాష్ట్ర సిరోంచకు రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం అందింది.
మండల కేంద్రంలోని కొమురం భీమ్ విగ్రహం వద్ద వాహనాలను చెక్ చేస్తున్న క్రమంలో రెండు డీసీఎంలలో తరలిస్తున్న సుమారు 300 ల క్వింటాళ్ల రేషన్ బియ్యం గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి , లారీలను, డ్రైవర్లు రాజు , శ్యాంను పోలీసులకు అప్పగించామని, బియ్యాన్ని గోడౌన్ కు తరలించామని తెలిపారు.