న్యూఢిల్లీ: బాలాకోట్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) జరిపిన దాడిలో 300 మంది టెర్రరిస్టులు చనిపోయారని పాకిస్తాన్ మాజీ డిప్లొమాట్ ఒకరు తాజాగా వెల్లడించారు. ఐఏఎఫ్ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అప్పుడు అబద్దం చెప్పామని ఒప్పుకున్నరు. ఇండియా జరిపిన సర్జికల్ స్ట్రైక్‌లో భారీ సంఖ్యలో టెర్రరిస్టులు చనిపోయినా మౌనంగా ఉండాల్సి వచ్చిందని పాకిస్తాన్ మాజీ డిప్లొమాట్ ఆఘా హిలాలే చెప్పారు. టీవీ డిబేట్లలో తరచుగా పాల్గొనే హిలాలే.. పాక్ ఆర్మీ తరఫున వకల్తా పుచ్చుకుని మాట్లాడతారు. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 2019 ఫిబ్రవరి 26న ఐఏఎఫ్ జరిపిన దాడిలో బాలాకోట్‌లో తలదాచుకున్న టెర్రరిస్టులు 300 మంది చనిపోయారని చెప్పారు. ప్రాణనష్టం గురించి వెల్లడిస్తే టెర్రరిస్టులు ఉన్నారని ఒప్పుకున్నట్లు అవుతుందనే కారణంగానే అప్పుడు మౌనం వహించామన్నారు.
ఫ్యాక్ట్ చెక్… బాలాకోట్ దాడిలో 300 మంది టెర్రరిస్టులు చనిపోయారన్న వార్తలో వాస్తవం లేదు
సవరణ :
నేషనల్ న్యూస్ ఏజెన్సీ నుంచి పై వార్త తీసుకోవడం జరిగింది. పాకిస్తాన్ మాజీ డిప్లొమాట్ తను మాట్లాడిన వీడియో ని ఎడిట్ చేసి తప్పుగా రాశారని ట్వీట్ చేసారు . తర్వాత ANI కూడా ఆ వార్తని తొలగించటం జరిగింది .