ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో రూఫ్‌టాప్ సోలార్ ఎనర్జీ ప్రోగ్రామ్ గురించి ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ మంగళవారం ( ఫిబ్రవరి 13) దీనికి పేరు పెట్టారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రతినెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడానికి పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ పథకం అని ప్రధాన మంత్రి మంగళవారం ప్రకటించారు. 75 వేల కోట్లకు పైగా పెట్టుబడితో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా కోటి ఇళ్లల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
In order to further sustainable development and people’s wellbeing, we are launching the PM Surya Ghar: Muft Bijli Yojana. This project, with an investment of over Rs. 75,000 crores, aims to light up 1 crore households by providing up to 300 units of free electricity every month.
— Narendra Modi (@narendramodi) February 13, 2024
భారీగా సబ్సీడీలు..
ఈ సోలార్ ప్యానెల్ పథకం (Rooftop solar scheme) కింద లబ్దిదారులకు గణనీయమైన సబ్సిడీలు అందిస్తామని, వాటిని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని 2024-25 మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ సబ్సీడీని ప్రజల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఇవ్వనున్నామన్నారు. అలాగే, రాయితీతో కూడిన బ్యాంకు రుణాలను అందిస్తామన్నారు. ‘‘పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ పరిధిలో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో, ఈ పథకం ప్రజలకు ఎక్కువ ఆదాయం, తక్కువ విద్యుత్ బిల్లులు, ఉపాధి కల్పనకు దారితీస్తుంది’’ అని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ పథకం కింద ఇల్లు లేదా భవనం రూఫ్ టాప్ పై సోలార్ ఫోటోవోల్టాయిక్ (P) ప్యానెల్స్ ను అమరుస్తారు.
Also Read:దుబాయ్‌లో UPI సేవలు.. ప్రారంభించిన మోడీ, యూఏఈ అధ్యక్షుడు
In order to further sustainable development and people’s wellbeing, we are launching the PM Surya Ghar: Muft Bijli Yojana. This project, with an investment of over Rs. 75,000 crores, aims to light up 1 crore households by providing up to 300 units of free electricity every month.
— Narendra Modi (@narendramodi) February 13, 2024
అర్హులు వీరే..
'సూర్య ఘర్' పథకం దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యుత్ భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, తక్కువ ఆదాయం కలిగిన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రెసిడెన్షియల్ వినియోగదారులు, గ్రూప్ హౌసింగ్ సొసైటీ సభ్యులు దరఖాస్తుకు అర్హులు.
ఇలా అప్లై చేసుకోవాలి
ఈ పథకానికి లబ్దిదారులుగా చేరాలంటే ముందుగా https://pmsuryaghar.gov.in వెబ్ సైట్ ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆ వెబ్ సైట్ లో ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా ఈ స్కీమ్ కు అప్లై చేసుకోవచ్చు.
- ముందుగా మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి.
- మీ విద్యుత్ పంపిణీ సంస్థను ఎంచుకోండి.
- మీ విద్యుత్ వినియోగదారు సంఖ్యను నింపండి.
- మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేయండి
స్టెప్ 2
- మీ కన్స్యూమర్ నెంబరు, మొబైల్ నెంబరులతో లాగిన్ అవ్వండి
- ఫారం లో పేర్కొన్న విధంగా వివరాలు నమోదు చేసి రూఫ్ టాప్ సోలార్ కోసం అప్లై చేయండి.
స్టెప్ 3
- మీ సాధ్యాసాధ్యాల ఆమోదం కోసం వేచి ఉండండి.
- మీ దరఖాస్తు ఆమోదం పొందగానే ఆ విషయాన్ని మీకు మెయిల్ లేదా మెసేజ్ చేస్తారు.
స్టెప్ 4
- ఇన్ స్టలేషన్ పూర్తయిన తరువాత, ప్లాంట్ వివరాలను సబ్మిట్ చేయండి. నెట్ మీటర్ కొరకు అప్లై చేయండి
స్టెప్ 5
- నెట్ మీటర్ ను ఇన్ స్టాల్ చేసిన తరువాత. డిస్కం అధికారులు తనిఖీ చేస్తారు. ఆ తరువాత, పోర్టల్ నుంచి కమిషన్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది.
- బ్యాంకు ఖాతా వివరాలు, రద్దయిన చెక్కును పోర్టల్ ద్వారా సబ్మిట్ చేయాలి.
- 30 రోజుల్లో మీ బ్యాంకు ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది