బీఆర్ఎస్, కాంగ్రెస్​ నుంచి 300 మంది కార్యకర్తలు బీజేపీలోకి..

ఆర్మూర్​/నందిపేట, వెలుగు: ఉమ్మడి నందిపేట మండలంలోని డొంకేశ్వర్, నికాల్​పూర్ ​గ్రామాలకు చెందిన 300 మంది బీఆర్ఎస్, కాంగ్రెస్​ పార్టీలకు చెందిన కార్యకర్తలు సోమవారం బీజేపీలో చేరారు. అంకాపూర్​లోని పైడి రాకేశ్​రెడ్డి నివాసంలో ఎంపీ ధర్మపురి అరవింద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డొంకేశ్వర్​ గ్రామానికి చెందిన కల్లెం సంతోష్​రెడ్డి, డొంకేశ్వర్​ఎత్తిపోతల వైస్ ​చైర్మన్​ భూమన్న పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.  ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అవినీతి అక్రమాలకు ప్రజలు చరమగీతం పాడే రోజులు వచ్చాయన్నారు.  వచ్చే ఎన్నికల్లో అక్రమంగా సంపాదించిన ప్రజల సొమ్మును కక్కిస్తామన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క డిపార్ట్​మెంట్​ బాగు పడలేదని, ఆర్మూర్, నిజామాబాద్ హాస్పిటల్స్​లో వైద్యులు లేని పరిస్థితి ఉందన్నారు.