దేశంలో విస్తరిస్తున్న కరోనా
ఏప్రిల్ 5న 4,289.. ప్రస్తుతం 7,598
ఒక్కరోజే మహారాష్ట్రలో 210, ఢిల్లీలో 183మందికి వైరస్
5 రోజుల్లోనే మరణాలు రెండింతలు
5వతేదీన 121..తాజాగా 246
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. పది రోజుల కిందట 2 వేలలోపున్న సంఖ్య ఇప్పుడు 7 వేలు దాటిపోయింది. ఈ పది రోజుల్లోనే మూడింతలకు మించి పెరిగింది. గత ఐదు రోజుల్లోనైతే మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గురు, శుక్రవారాల్లోనే 800 దాటిపోయాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,598 కేసులు నమోదవగా శుక్రవారం ఒక్కరోజే 869 మందికి వైరస్‌సోకింది.
ఫిబ్రవరి చివరి నాటికి మూడే
ఇండియాలో తొలి కేసు జనవరి 30న నమోదవగా.. నెల రోజుల తర్వాత ఫిబ్రవరి 29కి 3 కేసులయ్యాయి. మళ్లీ నెల తర్వాత మార్చి 31 నాటికి 1,635కు చేరాయి. తర్వాత పది రోజుల్లోనే ఏప్రిల్10 నాటికి 7,500 మించి పెరిగాయి. కేసుల్లో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇక్కడే 1,574 కేసులు నమోదయ్యాయి. తర్వాత తమిళనాడులో 911, ఢిల్లీలో 903 కేసులను గుర్తించారు. శుక్రవారం ఒక్క రోజే మహారాష్ట్రలో 210, ఢిల్లీలో 183 కేసులు నమోదయ్యాయి.
క్యూరైనోళ్లు పెరుగుతున్నరు
దేశవ్యాప్తంగా క్యూరైన వాళ్ల సంఖ్యరోజూ పదుల్లో పెరుగుతోంది. గత పది రోజుల్లో 600 మందికి మించి వైరస్‌నుంచి కోలుకున్నారు. ఈ ఐదు రోజుల్లోనే 400 మందికి పైగా క్యూరయ్యారు. వైరస్‌సోకి చనిపోతున్న వాళ్లు కూడా దేశంలో పెరుగుతున్నారు. మార్చి 31 నాటికి 50 లోపే ఉన్నమరణాలు ఇప్పుడు 240 దాటి పోయాయి. గత ఐదు రోజుల్లోనే సంఖ్య డబులైంది.
For More News..