పీఎం కేర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 5 రోజుల్లో 3 వేల కోట్లు

పీఎం కేర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 5 రోజుల్లో 3 వేల కోట్లు

ఆడిట్ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా సహాయక చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌‌‌‌‌‌‌‌కు తొలి 5 రోజుల్లో రూ.3,076 కోట్లు విరాళం గా వచ్చాయి. మార్చి 27 నుంచి 31 మధ్య ఈ మొత్తం వచ్చినట్లు ఆడిట్ స్టేట్ మెంట్‌‌‌‌లో ప్రభుత్వం పేర్కొంది. ఇందులో రూ.3,075.85 కోట్లు దేశంలోని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చాయని, మిగతా 39.67 లక్షలు ఫారిన్ కంట్రిబ్యూషన్‌‌‌‌ అన్నది. పీఎం కేర్స్ కు కార్పస్ ఫండ్ రూ.2.25 లక్షలని చెప్పింది. 35 లక్షల వడ్డీ వచ్చిందని తెలిపింది. ఈ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ను పీఎం కేర్స్ సైట్‌‌‌‌లో పెట్టింది. దాతల వివరాలను మాత్రం చెప్పలే.

ఎందుకు బయటపెట్టరు?: చిదంబరం

దాతల వివరాలను వెల్లడించక పోవడంపై కేంద్రాన్ని కాంగ్రెస్ నేత పి.చిదంబరం నిలదీశారు. ‘అంతటి ఉదారమైన డోనర్ల పేర్లను ఎందుకు బయటపెట్టలే’ అని ట్వీట్ చేశారు.

For More News..

వొడాఫోన్ ఐడియా నిలుస్తుందా?

పట్టణాల్లో కూడా ఉపాధి హామీ స్కీమ్

‘బ్యాడ్ బాయ్‌ బిలినియర్స్​’కు హైదరాబాద్ కోర్టు చెక్