రాజన్నసిరిసిల్ల, వెలుగు : సిరిసిల్లలో పవర్లూమ్ కార్మికుడు చనిపోవడంతో.. బాధిత కుటుంబానికి బీజేపీ నాయకులు రూ.30వేల ఆర్థిక సాయం అందించారు. బీవండికి చెందిన గడదాస్ కృష్ణ(39) సిరిసిల్లలో కుటుంబంతో కలిసి పనిచేసుకుంటున్నాడు.
బుధవారం గుండెపోటుతో చనిపోయాడు. డెడ్ బాడీని బీవండి తరలించేందుకు బీజేపీ నాయకులు ఆడెపు రవీందర్,శీలం రాజు, గాజులు వేణు అర్థిక సాయాన్ని అందించారు. కృష్ణ కు భార్య పుష్ప, కొడుకు చరణ్ సాయి ఉన్నారు.