మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్టుకు.. 30,879 మంది అటెండ్

మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్టుకు.. 30,879 మంది అటెండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన అడ్మిషన్ టెస్టు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 40,331 మందికి గానూ 30,879 (76.56%) మంది అటెండ్ అయినట్టు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్​చారి తెలిపారు. ఉదయం నిర్వహించిన సెషన్ లో ఆరో తరగతి అడ్మిషన్ల కోసం జరిగిన టెస్టుకు 23,944 మందికి గానూ 18,496 మంది హాజయ్యారు. 

 మధ్యాహ్నం సెషన్​లో ఏడు నుంచి పదో తరగతి వరకూ ఖాళీగా ఉన్న సీట్ల కోసం 16,387 మందికి గానూ 12,383 మంది పరీక్ష రాశారు. కాగా, షెడ్యూల్ ప్రకారం మే 20న ప్రిన్సిపాల్స్​ కు సెలక్షన్ లిస్టును పంపించనున్నారు. మే 28న మోడల్ స్కూళ్లలో ఫైనల్ సెలెక్షన్ లిస్టును వేయనున్నారు.