ఐదురోజుల్లో 31 కోట్లు: వాహన తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు

వెలుగు: ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఐదు రోజుల్లో రూ.31 కోట్ల నగదు పట్టు బడింది. ఎన్నికల కోడ్ అమలైన రెండ్రోజుల్లోనే రూ.30 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ వర్గాలు చెప్పాయి. తనిఖీల్లో 13 కిలోల బంగారం, 30 కిలోల వెండి, రూ.1.3 కోట్లు విలువైన మద్యం కూడా పట్టుబడింది. ఏపీలో 6,600 ఫ్లయింగ్ స్క్వాడ్ లు, 6,610 నిఘా టీమ్ లను ఈసీ ఏర్పాటు చేసింది. 31 బార్డర్, 46 తాత్కాలిక, 19 మొబైల్ పార్టీ చెక్ పోస్టుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. గురువారం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం లోని వడమాలపేట టోల్ ప్లాజా దగ్గర రూ.1.1 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు నుంచి తిరుపతికి తరలిస్తున్నట్లు గుర్తించారు.