భారీ ఎన్ కౌంటర్.. 31 మంది మావోయిస్టులు..ఇద్దరు జవాన్లు మృతి

భారీ ఎన్ కౌంటర్.. 31 మంది మావోయిస్టులు..ఇద్దరు జవాన్లు మృతి

ఛత్తీస్‎గఢ్‎ బీజాపూర్ జిల్లాలో  ఫిబ్రవరి 9( ఆదివారం) భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్లో31 మంది మావోయిస్టులు..ఇద్దరు జవాన్లు మృతి చెందగా ..మరికొందరికి గాయాలయ్యాయి.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

ప్రస్తుతం ఘటన స్థలంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.. మృతుల్లో అగ్రనేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ALSO READ | Viral Video: కుంభమేళాలో క్రికెట్​ ఆడిన బాబాలు

బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సమావేశం అయినట్లు భద్రతా దళాలకు ఇంటలిజెన్స్ సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన బలగాలు బీజాపూర్ జిల్లాలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రతా దళాలు, మావోయిస్టులు తారపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పరం కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో31  మంది మావోయిస్టులు హతం అయ్యారు.