- టైమ్ దాటితే సీరియస్ యాక్షన్
- ఫ్లై ఓవర్లు బంద్
- ఓఆర్ఆర్ పై ఆంక్షలు
- స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు
- గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన 3 కమిషనరేట్ల సీపీలు
హైదరాబాద్, వెలుగు: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై గ్రేటర్ లోని 3కమిషనరేట్లలో పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. బార్లు,లిక్కర్ షాప్‌లకు డిసెంబర్ 31రాత్రి 1 గంట వరకు పర్మిషన్స్ ఇస్తూ సర్కారు నిర్ణయం తీసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా రూల్స్‌ను అమలు చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం స్పెషల్ గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. మైనర్లను పబ్స్‌లోకి అనుమతించకూడదని, పబ్స్‌లో సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌లను కనీసం 15 రోజులు స్టోర్ చేయాలని సూచించారు. సెలబ్రేషన్స్ జరిగే ప్లేస్‌లో ఫుల్ లైటింగ్ ఉండేలా అరేంజ్‌మెంట్స్ చేయాలని చెప్పారు. వీటన్నింటిపై స్థానిక పోలీసులు పబ్స్, రెస్టారెంట్స్ యాజమాన్యాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు.
పబ్లిక్ ప్లేసెస్ పై నిఘా
3కమిషనరేట్ల పరిధిలో పబ్లిక్ ప్లేసెస్‌లో సెలబ్రేషన్స్,రోడ్లపై కేక్ కట్ చేయడాన్ని నిషేధించారు. పబ్స్ పరిసర ప్రాంతాల్లో స్థానిక పోలీసులతో పెట్రోలింగ్ నిర్వహించనున్నరు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ సహా పబ్లిక్ ప్లేసెస్‌లోని పార్కుల్లో బీట్ కానిస్టేబుల్స్‌ను నియమిస్తున్నారు. ట్యాంక్ బండ్‌తో పాటు సిటీలోని ఫ్లై ఓవర్స్‌ను డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 తెల్లవారుజామున 5గంటల వరకు క్లోజ్ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో సుమారు 220 టీమ్స్‌తో స్పెషల్ డ్రంకన్ డ్రైవ్ చెకింగ్స్ నిర్వహించనున్నారు. పబ్స్ సమీపంలో స్పెషల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు.
ముందస్తు పర్మిషన్ తీసుకోవాలె
హోటల్స్, పబ్స్, క్లబ్స్ నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకోవాలి.సీసీకెమెరాలు నిరంతరం ఆన్‌లోనే ఉండాలి.కొవిడ్ గైడ్ లైన్స్ బ్రేక్ చేస్తే యాక్షన్ తీసుకుంటం. డ్రగ్స్, గాంజా సప్లయర్స్‌పై నిఘా పెట్టాం.ఫ్లైఓవర్స్ క్లోజ్చేస్తాం. ర్యాండమ్‌గా డ్రంకన్ డ్రైవ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం.పబ్లిక్ న్యూసెన్స్ చేస్తే చర్యలు తప్పవు. -స్టీఫెన్ రవీంద్ర ,సీపీ, సైబరాబాద్
రిసార్ట్స్, ఫాంహౌస్లపై నిఘా
రిసార్ట్స్,ఫాంహౌస్లపై నిఘాపెట్టాం. గ్రామీణ ప్రాంతాలు, నేషనల్ హైవేస్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తం.ఓఆర్‌ఆర్ పై ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తం. అనుమానిత ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తున్నం.పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ సిబ్బందితో గస్తీ పెంచుతం. జనవరి1న గుడుల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశాం. -మహేశ్ భగవత్, సీపీ ,రాచకొండ
మాస్క్‌లు, ఫిజికల్ డిస్టెన్స్ మస్ట్: సిటీ సీపీ సీవీ ఆనంద్
న్యూయర్ సెలబ్రేషన్స్ ను ప్రశాంతంగా జరుపుకోవాలని సిటీ సీపీ సీవీ ఆనంద్ సూచించారు.బుధవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ఆయన విజిట్ చేశారు. జాయింట్ సీపీ, క్రైమ్స్ ఏఆర్ శ్రీనివాస్‌తో కలిసి సుమారు 2 గంటల పాటు బాధితుల కంప్లయింట్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్, విజిటర్స్, విమెన్స్ హెల్ప్ డెస్క్‌లను పరిశీలించారు.స్టేషన్‌కు వచ్చిన వారితో మాట్లాడారు. సిబ్బంది ప్రవర్తన,సర్వీస్ ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. జనాలకు మరింత అందుబాటులో ఉండే విధంగా సర్వీస్ చేయాలని స్థానిక ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డికి సూచించారు.పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు. డైలీ ఒక పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని తెలిపారు.
న్యూఇయర్సెలబ్రేషన్స్లోభాగంగాపబ్బులు,హోటళ్లలోమాస్కులు,ఫిజికల్ డిస్టెన్స్ రూల్స్ పాటించాలన్నారు.పబ్బుల్లో చిన్నపిల్లలను అనుమతించకూడదన్నారు. స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని సీవీ ఆనంద్ హెచ్చరించారు. రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు ఫ్లైఓవర్లను మూసి వేస్తామన్నారు.
న్యూ ఇయర్ గైడ్‌లైన్స్
- మాస్క్ లేకుంటే రూ. వెయ్యి ఫైన్
- పబ్‌ల్లో రెండు డోసుల సర్టిఫికెట్ మస్ట్
- ఓపెన్ ఏరియాల్లో డీజేలకు నో పర్మిషన్
- తాగి వెహికల్ నడిపితే 6 నెలల జైలు, రూ 10 వేలు ఫైన్
- ఎక్కడికక్కడ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు
- పబ్‌ల్లో అసభ్యకర డ్యాన్స్,డ్రెస్సింగ్‌ను అనుమతించరాదు
- పబ్‌లు, రెస్టారెంట్లు, ఓపెన్ ప్లెసెస్ వద్ద షీ టీమ్స్ పోలీసుల ప్రత్యేక నిఘా