
పానీపూరీ చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్..చిన్నలు, పెద్దలు అందరూ పానీపూరీని ఇష్టపడుతుంటారు.ముఖ్యంగా స్టూడెంట్స్, యూత్ పానీపూరీ టేస్ట్ ను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇక్కడ పానీపూరీ విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్ లో పానీపూరి తిని స్టూడెంట్స్ ఆస్పత్రి పాలయ్యారు. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని నాందేడ్ లో ఫుడ్ పాయిజన్ తో 31 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. రోడ్డు పక్కన అమ్ముతున్న పానీపూరి తిన్న విద్యార్థులు అనారోగ్యం బారిన పడటంతో నాందేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విద్యార్థులు స్వామి రామానంద తీర్థ మరట్వాడా యూనివర్సిటీ, SGGS కాలేజీ, నర్సింగ్ కళాశాల విద్యాసంస్థలకు చెందిన వారిగా గుర్తించారు.
Also Read : కోనార్క్ ఎక్స్ప్రెస్లో 12 కిలోల గంజాయి సీజ్
ఒకే స్టాల్‌లో పానీ పూరి తిన్న తర్వాత వాంతులు, వికారం వంటి ఫిర్యాదులతో విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. చికిత్స అందించిన తర్వాత ప్రస్తుత విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. విద్యార్థుల అస్వస్థతకు పానీపూరి కారణం అయి ఉండొచ్చని డాక్టర్లు చెపుతున్నారు.
మహారాష్ట్రలో కలుషిత ఆహారం , నీరు తాగి ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్న ఘటన కొత్తేమి కాదు..ఇటీవల కాలంలో గ్రేటర్ నోయిడాలోని హౌసింగ్ సొసైటీ లో ఒకేసారి 200మంది అనారోగ్యం పాలయ్యారు. కలుషిత నీరే దీనికి కారణమని హౌసింగ్ సొసైటీ వాసులు ఆరోపించారు.