Cricket World Cup 2023: 31 ఏళ్ళ తర్వాత వరల్డ్ కప్‌లో అరుదైన రికార్డ్

Cricket World Cup 2023: 31 ఏళ్ళ తర్వాత వరల్డ్ కప్‌లో అరుదైన రికార్డ్

భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ అభిమానులని దిల్ ఖుష్ చేస్తుంది. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన జట్లు చతికిలపడుతుంటే.. అండర్ డాగ్ టీమ్స్ మాత్రం అదరగొడుతున్నాయి. ఇప్పటివరకు అన్ని జట్లు కూడా కనీసం ఒక్క మ్యాచులో గెలిచి సత్తా చాటాయి. పసికూనలుగా భావించిన నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ సైతం అప్పుడే బోణీ కొట్టేశాయి. దీంతో వరల్డ్ కప్ లో 31 ఏళ్ళ తర్వాత ఒక అరుదైన రికార్డ్ నమోదయింది. 

1992 వరల్డ్ కప్ రౌండ్ రాబిన్ తరహాలోనే జరిగింది. మొత్తం 9 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో అన్ని జట్లు కూడా కనీసం ఒక మ్యాచులోనైనా విజయం సాధించాయి. జింబాబ్వే విజయం సాధించడం హైలెట్ గా మారింది. ఇక సరిగ్గా 31 ఏళ్ళ తర్వాత అదే సీన్ రిపీట్ అవ్వడం ఆశ్చర్యకరంగా మారింది. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఇంగ్లాండ్ కి షాకివ్వడం, దక్షిణాఫ్రికా పై నెదర్లాండ్స్ గెలవడం సంచలనంగా మారింది. 

తాజాగా నిన్న శ్రీలంక జట్టు నెదర్లాండ్స్ పై గెలవడంతో 10 జట్లు కూడా కనీసం ఒక్క మ్యాచులో గెలిచి 1992 ఫీట్ రిపీట్ అయింది. 1992 తర్వాత కనీసం ఒక్క జట్టయినా బోణీ కొట్టకుండానే ఇంటిముఖం పట్టాయి.  1996 లో నెదర్లాండ్స్.. 1999 లో కెన్యా, స్కాట్లాండ్.. 2003 లో నమీబియా, బంగ్లాదేశ్.. 2007 లో కెనడా, బెర్ముడా, జింబాబ్వే, స్కాట్లాండ్.. 2015 లో  స్కాట్లాండ్..  UAE.. 2019 లో ఆఫ్ఘనిస్తాన్  ఈ లిస్టులో వరల్డ్ కప్ లో తన ఖాతా తెరవకుండానే నిష్క్రమించాయి.