
నెయ్యి స్వచ్ఛతకు చిహ్నం..రుచికి, పోషక విలువలకు స్పెషల్.దీనికి వంటకాల్లో, ఆయుర్వేదంలో బాగా వినియోగిస్తారు. అందుకే నెయ్యికి అంత డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుత మార్కెట్లో అధికంగా కల్తీ అవుతోంది. వెజ్ టేబుల్ ఆయిల్స్, కొవ్వు నూనెల కంటే అధికంగా నెయ్యిని కల్తీ చేసి అమ్ముతున్నారు వ్యాపారులు. దేశవ్యాప్తంగా నెయ్యికి పెరుగుతున్న డిమాండ్ కు ఆసరగా చేసుకొని పెద్ద ఎత్తు నెయ్యిని కల్తీ చేస్తున్నారు. తాజాగా గుజరాత్ లో భారీ మొత్తంలో కల్తీ నెయ్యిని పట్టుకున్నారు ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అధికారులు.
ఖేడా జిల్లాలోని శ్రీ క్షేమ కళ్యాణి పాలు, పాల ఉత్పత్తులపై FDCA అధికారులు దాడులు చేశారు. దాదాపు రూ.8.75 లక్షల విలువైన 3టన్నుల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ సమయంలో 1500 కిలోల నెయ్యి, 1600 కిలోల వెన్న, 1 లీటర్ నెయ్యికి రుచిని కలిగించే ఆయిల్ను సీజ్ చేశారు. ఆ కంపెనీకి చెందిన FSSAIలైసెన్స్ ను రద్దుచేశారు. డీలర్ కు రూ. 2లక్షల జరిమాని విధించారు.
ఈ సంఘటన మనం రోజూ ఆహార పదార్థాలలో వాడుకునే కల్తీ నెయ్యి గురించి ఆందోళనలను లేవనెత్తుతుంది. నకిలీ నెయ్యిని ఎలా గుర్తించాలి, స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అని ఎలా నిర్ధారించుకోవాలో తెలుసుకుందాం.
స్వచ్ఛమైన నెయ్యిని రంగు ద్వారా గుర్తించవచ్చు..
స్వచ్ఛమైన నెయ్యి బంగారు పసుపు రంగులో ఉంటుంది. మంచి రుచిని కలిగి ఉంటుంది. నెయ్యి లేతగా లేదా అసాధారణంగా తెల్లగా కనిపిస్తే అది స్టార్చ్, ఇతర రసాయనాలు లేదా జంతువుల కొవ్వులతో కల్తీ అయ్యాయని గుర్తించాలి.
వాసనద్వారా..
నెయ్యి పాల కొవ్వుల నుండి వచ్చే వగరు వాసనతో ఉంటుంది. నెయ్యి వాసన పోతే పుల్లగా ఉంటే లేదా అసహ్యకరమైన వాసన కలిగి ఉంటే అది ఇతర నూనెలు, రసాయనాలు లేదా సంరక్షణకారులతో కల్తీ అయి ఉండవచ్చు. అది దాని సహజ సువాసనను దిగజార్చుతుంది.
ALSO READ : Health Tips: నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే..ప్రాణాంతక వ్యాధులకు ఛాన్స్.. నివారించాలంటే..
నీటి పరీక్షద్వారా ..
కొద్ది మొత్తంలో నెయ్యి తీసుకొని కొన్ని చుక్కల నీరు కలపాలి. నెయ్యి సులభంగా విడిపోవడం లేదా ఉపరితలంపై నీటి బిందువులుగా ఏర్పడితే అది కల్తీకి అయి ఉండవచ్చు. స్వచ్ఛమైన నెయ్యిని నీటిలో కలిపినప్పుడు వేరు చేయకుండా మృదువైన స్థిరత్వాన్ని ఏర్పరుస్తుంది.
ఆకృతి చెక్ చేయడం ద్వారా..
స్వచ్ఛమైన నెయ్యిని చెంచాతో తీసేటప్పుడు మృదువైన కణిక ఆకృతిని కలిగి ఉంటుంది. అదే కల్తీ నెయ్యి జిడ్డుగా లేదా మైనపుగా అనిపిస్తుంది. చెంచా లేదా మీ చేతులపై జిడ్డుగల అవశేషాలను వదిలివేస్తుంది. అపుడు ఇది కూరగాయల నూనెలు లేదా ఇతర కొవ్వులు ఉన్నట్లు గుర్తించాలి.
చల్లబర్చడం ద్వారా..
రిఫ్రిజిరేటర్‌లో కొద్ది మొత్తంలో నెయ్యిని కొన్ని గంటలపాటు ఉంచండి. స్వచ్ఛమైన నెయ్యి గట్టిపడి, ఎటువంటి జిడ్డు అవశేషాలను వదలకుండా గట్టిగా మారుతుంది. నెయ్యి ద్రవంగా ఉంటే లేదా జిడ్డు అవశేషాలు మిగిలి ఉంటే అందులో పాలలోని కొవ్వులు లేదా చౌకైన నూనెలు వంటి కల్తీ పదార్థాలు కలిసి ఉన్నట్లు గుర్తించాలి.