317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ భేటి

317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ భేటి

 హైదరాబాద్, వెలుగు: స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని 317 జీవో బాధితులు ప్రభుత్వానికి పెట్టుకున్న అప్లికేషన్లను ఆయా శాఖలకు పంపాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. గురువారం సెక్రటేరియెట్​లో సబ్ కమిటీలోని మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సుమారు 2 గంటల పాటు సమా వేశమయ్యారు. స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. 

50వేల అప్లికేషన్లు రాగా శాఖల వారీగా డివైడ్ చేసి, వాటిని పరిశీలించి తిరిగి మాకు రిపోర్ట్ ఇవ్వాలని జీఏడీ అధికారులను మంత్రులు ఆదేశించారు. సమవేశం ముందు పలువురు 317 జీవో ఉద్యోగులు, టీచర్లు ఇతర బాధితులు మంత్రులను కలిసి త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని విన తిపత్రాలు అందచేశారు. జీఏడీ సెక్రటరీ రఘనందన్ రావు, రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ పాల్గొన్నారు.