కడప సెంట్రల్ జైళ్లో 317 మందికి కరోనా

కడప సెంట్రల్ జైళ్లో కరోనా పంజావిసిరింది. దాదాపు 300 మందికి పైగా ఖైదీలకు కరోనా సోకింది. బాధితుల్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. వైరస్ సోకిన వారందరికీ ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. కడప జిల్లాలో మంగళవారం 755 కేసులు నమోదుకాగా.. అందులో 300 పైగా కేసులు సెంట్రల్ జైళ్లో నమోదైనవే కావడం గమనార్హం. ఒకేసారి జైళ్లో వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదుకావడంతో.. జైలు అధికారులు, ఖైదీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సెంట్రల్ జైలులో మొత్తం 703 మంది ఖైదీలున్నారు. వీరందరికీ మూడు విడుతల్లో కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 317 మంది ఖైదీలుకు, 14 మంది సిబ్బందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో వీరందరిని జైలులోనే ప్రత్యేకంగా రెండు బ్లాకులలో ఉంచి.. ముగ్గురు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. కాగా.. వైరస్ సోకిన వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు అంతగా కనిపించడంలేదని వైద్యులు, అధికారులు అంటున్నారు.

For More News..

కరోనాను లైట్  తీసుకుంటున్నరు