వరంగల్ జిల్లాలో మరో ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉప్పల రమేష్ అనే టీచర్ వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో టీచర్ గా చేస్తున్నారు. బదిలీల్లో భాగంగా ములుగు జిల్లాకు బదిలీ అయింది. అసలే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న తనకు బదిలీల్లో స్థానికత కోల్పోవటంతో మరింత ఆవేదనకు గురయ్యారు. ఇతర జిల్లాకు వెళ్లాల్సి రావడం భారం అవుతుందని వేడుకున్నా.. తనను అన్యాయంగా బదిలీ చేశారని.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు వాపోయారు.
ఇవి కూడా చదవండి