అథ్లెటిక్స్ చాంపియన్​షిప్​కు 32 మంది

అథ్లెటిక్స్ చాంపియన్​షిప్​కు 32 మంది

మెదక్, వెలుగు: మెదక్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపికలు జరిగాయి. ఇందులో జిల్లా నలుమూల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్16, 18, 20 మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో ఎంపికలు జరిగాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 32 మంది క్రీడాకారులను స్టేట్​అథ్లెటిక్​క్రాస్​కంట్రీ చాంపియన్​షిప్​కు ఎంపిక చేశారు. 

వీరు ఈ నెల 22న నాగర్ కర్నూల్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని మెదక్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరమణ, మధుసూదన్  తెలిపారు.