హేగ్: ఉబర్ రెయిడ్ సర్వీస్ సంస్థకు నెదర్లాండ్స్ డేటా ప్రొటెక్షన్ విభాగం (డీపీఏ) భారీ జరిమానా విధించింది. యురోపియన్ డ్రైవర్ల పర్సనల్ వివరాలను అమెరికాకు ట్రాన్స్‌ఫర్ చేసిన కేసులో హేగ్‌లోని డేటా ప్రొటెక్షన్ సంస్థ 32.4 కోట్ల డాలర్ల ఫైన్వేసింది. ఉబెర్ సంస్థ యూరోపియన్ ట్యాక్సీ డ్రైవర్ల వ్యక్తిగత డేటాను యునైటెడ్ స్టేట్స్ (యుఎస్)కి బదిలీ చేసిందని, ఈ బదిలీకి సంబంధించి డేటాను సముచితంగా భద్రపరచడంలో విఫలమైందని పేర్కింది.
రెండేండ్లుగా డేటా ట్రాన్స్‌ఫర్ జరిగిందని, యురోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ రూల్స్‌ను ఉల్లంఘించారని డీపీఏ వెల్లడించింది. కాగా, డచ్ డేటా నిఘా విభాగం తీసుకున్న నిర్ణయాన్ని ఉబర్ సంస్థ తప్పుపట్టింది. దీనిపై కోర్టులో అప్పీల్ చేయనున్నట్టు ఆ సంస్థ పేర్కొంది.