
అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను ఉల్లంఘించారని 32 మంది భారతీయ జాలర్లను ఆదివారం(ఫిబ్రవరి 23) శ్రీలంక నేవి అరెస్ట్ చేసింది. ఐదు మరబోట్లను పట్టుకున్నారు.
శనివారం మొత్తం 450 మరబోట్లు సముద్రంలోకి వెళ్లగా.. IMBL సమీపంలో ఫిషింగ్ చేస్తున్న జాలర్లను శ్రీలంక నేవీ పెట్రోలింగ్ యూనిట్ తరిమి కొట్టినట్లు మిగతా జాలర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఐదు బోట్లను గస్తీ విభాగం పట్టుకుంది. 30మంది జాలర్లను అరెస్ట్ చేశారు. వీరంతా రామనాథపురంకు చెందినవారు.
అరెస్టయిన వారిని మన్నార్ మత్స్య శాఖకు అప్పగించారు. అరెస్ట్ నేపథ్యంలో ఫిబ్రవరి 28న నిరవధిక సమ్మె ఉధృతం చేయాలని రామనాథపురంలో మత్స్య కారుల సంఘం నిర్ణయించింది.
ALSO READ | మరికొన్ని యూఎస్ ప్రొడక్ట్‌లపై తగ్గనున్న సుంకాలు!
గత రెండు నెలల్లో శ్రీలంక నేవిదళం అరెస్ట్ చేసిన మత్స్యకారుల్లో 108 మంది జాలర్లు,16బోట్లు రామనాథపురం జిల్లాకుచెందినవి కావడం గమనార్హం. ఇందులో ఫిబ్ర వరిలో 11బోట్లు, 66 మంది జాలర్లు పట్టుబడ్డారు.
అరెస్టు చేసిన మత్స్యకారులను విడిచిపెట్టి,జప్తు చేసిన పడవలను స్వాధీనంచేసుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మత్స్యకార సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.