భారీ వర్షాలు.. హైదరాబాద్‎లో 32 చెరువులు ఫుల్

హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలకు గ్రేటర్ పరిధిలోని చెరువులు నిండాయి. మొత్తం185 చెరువులు ఉండగా, దాదాపు అన్నింటికీ వరదనీరు వచ్చి చేరుతోంది. ఇందులో 32 చెరువులు ఎఫ్టీఎల్‎ని మించిపోయాయి. జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం అధికారులు ఎప్పటికప్పుడు వాటర్​లెవల్స్‎ను పరిశీలిస్తున్నారు. అవసరమైతే నీటిని బయటకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలెర్ట్ చేస్తున్నారు. 

డీఆర్ఎఫ్, మాన్సూన్ టీమ్స్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి, చెరువులు ఫుల్ అయ్యాయని మైక్ ద్వారా అనౌన్స్​మెంట్​ఇస్తున్నారు. శేరిలింగంపల్లిలో 9,  కుత్బుల్లాపూర్‎లో 5, కూకట్ పల్లిలో 5,  ఉప్పల్‎లో 3, షేక్ పేటలో 3, బాలానగర్, మణికొండ, ఖైరతాబాద్, అల్వాల్, బహదూర్ పురా, గోల్కొండ, ఆర్సీపురం ప్రాంతాల్లో ఒక్కో చెరువు ఎఫ్టీఎల్​ను మించాయి.