ప్రమోషన్​ ప్లీజ్.. ఏడాదిగా దాటవేస్తున్న అధికారులు

ప్రమోషన్​ ప్లీజ్.. ఏడాదిగా దాటవేస్తున్న అధికారులు
  • బల్దియా ఉద్యోగుల వెయిటింగ్
  • 320 మంది ఎదురుచూపులు

 హైదరాబాద్ సిటీ, వెలుగు:  జీహెచ్ఎంసీలో 320 మంది ఉద్యోగులు ఏడాదిగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ గా, సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ గా, సూపరింటెండెంట్ నుంచి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గా, మున్సిపల్ కమిషనర్ల నుంచి డిప్యూటీ కమిషనర్ గా ప్రమోషన్స్ పొందాల్సిన వారు ఉన్నారు. ప్రమోషన్స్ లిస్ట్​ఫైనల్ అయినా, పదోన్నతులు ఇవ్వకపోడంతో తాము అన్ని విధాలుగా నష్టపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇటీవల లాంగ్ స్టాండింగ్ పేరుతో బదిలీలు చేసిన ఉన్నతాధికారులు పదోన్నతుల విషయంలో వెనకడుగు వేస్తున్నారని వాపోతున్నారు. ప్రమోషన్స్ అంటున్నప్పటి నుంచి ముగ్గురు కమిషనర్లు బదిలీ అయ్యారని, ఇప్పటికైనా తమకు పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు.