హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్ హైద్రాబాద్ లోని పార్కులలో వారం పాటు క్లిన్ నెస్ డ్రైవ్ ను చేపట్టినట్లు తెలిపారు GHMC అధికారులు. అందులో భాగంగానే శుక్రవారం గ్రీన్ ఫ్రైడే నిర్వహిస్తున్నామని తెలిపారు. బంజారాహిల్స్ లోని గ్రీన్ వ్యాలీలో ఉన్నసీడబ్ల్యూ పార్క్ దగ్గర క్లీన్లినెస్ డ్రైవ్ చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు GHMC మేయర్ బొంతు రామ్మోహన్. సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ ను హరితనగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. గ్రేటర్ హైద్రాబాద్ లో ప్రస్తుతం 900 పార్కులు ఉన్నాయని.. నిరూపయోగంగా ఉన్న పార్కులకు పూర్వ వైభవం తెస్తామన్నారు.
ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించుటకు గ్రేటర్ హైద్రాబాద్ లో కొత్తగా 320 పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్న మేయర్.. 50 థీమ్ పార్కులను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అన్ని వయస్సుల వారికి ఉపయోగపడే విధంగా పార్కులలో వాకింగ్ ట్రాక్ లతో పాటు , జిమ్ లు , ఇతర వసతులు కల్పిస్తున్నామన్నారు. గ్రేటర్ హైద్రాబాద్ లో శిథిలావస్దకు చేరిన భవనాలను నేలమట్టం చేస్తామని, అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తామన్నారు GHMC మేయర్ బొంతు రామ్మోహన్.