అమెరికాలో కరోనాతో ఒక్కరోజే 3,260 మంది బలి

వాషింగ్టన్: చాలా దేశాల్లో రోజువారీ కరోనా కేసులు తగ్గుతున్నా.. అమెరికాలో మాత్రం మరింత పెరుగుతున్నాయి. మరణాలూ వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే అక్కడ 3,260 మంది చనిపోగా.. 2 లక్షల 26 వేల 762 మంది దాని బారిన పడ్డారు. ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన మరణాల్లో ఇదే అత్యధికం. బుధవారం 18 లక్షల మందికి టెస్టులు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా కోటీ 58 లక్షల 24 వేల మందికి కరోనా సోకగా.. 2 లక్షల 96 వేల 777 మంది చనిపోయారు. కేసులు పెరిగిపోతుండడంతో రెండు వ్యాక్సిన్లను ఓకే చేసేందుకు అమెరికా రెడీ అవుతోంది. ఫైజర్, మోడెర్నా టీకాలపై యూఎస్​ఎఫ్​డీఏ రివ్యూలు చేస్తోంది. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లతో ఈ ఏడాది చివరి నాటికి 2 కోట్ల మందికి టీకాలు వేయొచ్చని, జనవరి నాటికి 5 కోట్ల మందికి వేస్తామని హెల్త్​, హ్యూమన్​ సర్వీసెస్​ మంత్రి అలెక్స్​ చెప్పారు. మార్చి చివరి నాటికి 10 కోట్ల మందికి వ్యాక్సిన్​ అందుతుందన్నారు. ఎమర్జెన్సీ వాడకానికి అనుమతులు వచ్చిన 24 గంటల్లో అన్ని సెంటర్లకు వ్యాక్సిన్లను పంపిస్తామని ఆపరేషన్​ వార్ప్​ స్పీడ్​ చీఫ్​ ఆపరేటింగ్​ ఆఫీసర్​ ఆర్మీ జనరల్​ గుస్తావే పేర్నా చెప్పారు.

For More News..

నేడు రోహిత్​కు ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ టెస్ట్‌‌‌‌

ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ సుప్రీంకోర్టుకు ట్రంప్

క్రికెట్‌‌కు గుడ్‌‌బై చెప్పిన పార్థివ్‌‌కు సూపర్ ఆఫర్