గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. భార్యతో వాకింగ్‌కు వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన ఇండోర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 32 ఏళ్ల జగదీష్ అనే వ్యక్తి ఆదివారం ( ఫిబ్రవరి 18) తన భార్యతో కలిసి వాకింగ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో ఆయన భార్య వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే జగదీష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్యభర్తలు షాపింగ్‌నకు దగ్గరలోని షాపునకు వెళ్లారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదీష్‌కు తల్లిదండ్రులు గతంలోనే మరణించారు. ఐదుగురు అక్కా చెల్లెళ్లు. జగదీష్ కు రెండేళ్ల క్రితం వివాహమైంది. సోమవారం ( ఫిబ్రవరి 19) తెల్లవారుజామున జగదీష్ సోదరీమణులకు విషయం తెలిపింది. సైలంట్ హార్ట్ ఎటాక్ అని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
శనివారం ( ఫిబ్రవరి 17) ఇండోర్ లోని ముసాఖేడి ప్రాంతంలో రాహుల్ రైక్వార్(26) అనే వ్యక్తి కూడా ఇలానే మరణించాడు. తన తమ్ముడితో కలిసి బైక్ పై పిలియన్ రైడింగ్ చేస్తున్న సమయంలో రాహుల్ మార్గమధ్యంలో గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు దృవీకరించారు.