తమిళనాడు రాజధాని చెన్నైలో ప్లైట్ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. చెన్నై శివారులో దట్టమైన పొగమంచు, భోగి సందర్భంగా...వ్యర్థాల కాలుష్యం ఎఫెక్ట్ తో... ముందు జాగ్రత్తగా 33 విమానాలు సమయాలను మార్చారు. ఉదయం చెన్నైకి రావాల్సిన ఢిల్లీ, బెంగళూరు ప్లైట్ సర్వీసులను రద్దు చేశారు.
భోగీ సందర్భంగా చెన్నైఎయిర్ పోర్టు చుట్టూ ఉన్న... మీనంబాక్కం, గౌల్బజార్, పమ్మల్, అనకాపుత్తూర్, తరైపాక్కం ప్రాంతాల్లో.. పెద్దఎత్తున టైర్లు, పాత ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చేస్తున్నారు. దీంతో ఎయిర్ పొల్యూషన్ భారీగా పెరిగింది. సరైన వెలుతురు లేకపోవటంతోనే ప్లైట్ సర్వీసుల టైమ్ మార్చినట్లు ఎయిర్ పోర్టు అధికారులు చెబుతున్నారు.