ఎల్బీనగర్ మన్సూరాబాద్ లో ప్రమాదం జరిగింది . 33 కేవీ విద్యుత్ లైన్ వైర్లు తెగి కిందపడ్డాయి. బాగా రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో అటు వైపుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. కొంతమంది స్థానికులు TGPDCL సిబ్బందికి సమాచారం అందించడంతోవారు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి .... 33 కెవి లైన్ సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరిస్తారని చెప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే వార్త రాసే సమయానికి ( మధ్యాహ్నం 2.30 గంటల వరకు) 33 కెవి లైన్స్ సిబ్బంది స్పందించలేదని సమాచారం అందుతోంది. . .