గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుకు 3.36 లక్షల అప్లికేషన్లు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుకు 3.36 లక్షల అప్లికేషన్లు

కరీంనగర్, వెలుగు: నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్సీ ఓటు కోసం బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు 3,36,362 మంది అప్లై చేసుకున్నారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 72,702 , జగిత్యాలలో 32,899, సిద్దిపేట జిల్లాలో 30,440, మంచిర్యాల జిల్లాలో 28,567, నిజామాబాద్ జిల్లాలో 27,179 పెద్దపల్లిలో 27,500, సంగారెడ్డిలో 26,484, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 20,922 అప్లికేషన్లు వచ్చాయి.

మిగతా జిల్లాల్లో 20 వేల లోపు అందాయి. ఇప్పటివరకు 1.39 లక్షల అప్లికేషన్లను అధికారులు అప్రూవ్ చేశారు. మరో 1.80 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి 12 గంటలతో అప్లికేషన్ గడువు ముగిసింది. పట్టభద్రుల ఓటరు నమోదు గడువు పెంచాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి హైదరాబాద్‎లో వినతిపత్రం అందజేశారు.