
సదరన్ రైల్వే పరిధిలోని పెరంబూర్, పొడనూర్ వర్క్‌షాపుల్లో వివిధ ట్రేడుల్లో పనిచేయడానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అభ్యర్థులు జూన్ 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
ఖాళీలు: 3378
పనిచేసే ప్రదేశాలు: క్యారేజ్ అండ్ వేగన్ వర్క్స్, రైల్వే హాస్పిటల్, ఎలక్ట్రికల్ వర్క్‌షాప్, లోకో వర్క్స్, ఇంజినీరింగ్ వర్క్‌షాప్, చెన్నై డివిజన్.
విభాగాలు: ఫ్రెషర్ కేటగిరి, ఎక్స్ ఐటీఐ, ఎంఎల్టీ
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ తదితరాలు.
అర్హత: పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజి) సబ్జెక్టుల్లో అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాలి.
వయసు: 15 ఏండ్లు నిండి ఉండాలి, 22 నుంచి 24 ఏండ్లకు మించకుండా ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థును ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: ఆన్లైన్
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అప్లికేషన్స్ ప్రారంభం: 1 జూన్ 2021
దరఖాస్తులకు చివరితేది: 30 జూన్ 2021
వెబ్సైట్: sr.indianrailways.gov.in