ట్రాఫిక్ చలాన్స్ ఆఫర్ అప్డేట్: 33.81 లక్షల చలాన్స్ క్లియర్.. రూ. 29.45 కోట్లు వసూలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహనాల పెండింగ్ చలాన్లపై ఆఫర్ ప్రకటించడంతో పెద్ద ఎత్తున చలాన్ల క్లియరెన్స్ కొనసాగుతోంది. డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 30 (శనివారం) వరకు రాష్ట్ర వ్యాప్తంగా 33.81 లక్షల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయి. వీటి ద్వారా రూ. 29.45 కోట్లు వసూలు అయ్యాయి. 

హైదరాబాద్ లో శనివారం(డిసెంబర్ 30) వరకు 11.17 లక్షల పెండింగ్ చలాన్లు క్లియర్ కాగా.. వాటి ద్వారా ఫైన్ అమౌంట్ రూ. 7.7 కోట్ల ఆదాయం వచ్చింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3.5 లక్షల పెండింగ్ చలాన్స్  క్లియర్ అయ్యారు. వాటి ద్వారా రూ. 2.86 కోట్ల ఫైన్ అమౌంట్ వసూలు అయ్యింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6.23 లక్షల పెండింగ్ చలాన్స్ క్లియర్ కాగా.. వాటి ద్వారా రూ. 6.31 కోట్ల ఫైన్ అమౌంట్ వసూలు అయ్యింది.