కరోనా వ్యాప్తి రోజురోజుకూ దేశవ్యాప్తంగా విపరీతంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు.. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రధాని మోడీ ఇప్పటికే లాక్ డౌన్ ను కూడా పొడిగించే విషయం గురించి ఆలోచిస్తున్నారు. ఆయన శనివారం వివిధ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజారోగ్యం దృష్ట్యా లాక్ డౌన్ పొడిగింపుకే ఓటేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 8,453కు చేరాయి. ఈ వైరస్ వల్ల 289 మంది మరణించారు. కాగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 909 కేసులు నమోదుకావడంతోపాటు.. 34 మంది మరణించారు. దాంతో మరింత పటిష్టంగా లాక్ డౌన్ అమలుచేయాలని కేంద్రం సూచించింది.
For More News..