బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లోని టికెట్ బుకింగ్ కౌంటర్ నుంచి రూ.34 లక్షల నగదు మాయం అయ్యాయి. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ లో అవుట్ సోర్సింగ్ విధానంలో క్యాష్ రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్న బడే శ్రీపతి బాబు ఈ ఏడాది జనవరి 1 నుంచి జూలై 20 వరకు నగదును బ్యాంకులో జమ చేయలేదు. రైల్వే అధికారుల లెక్కల్లో రూ.34, 16,330 నగదు తేడా వచ్చింది.
దీంతో 3న ఈ విషయంపై రహస్యంగా విచారణ చేపట్టారు. అవకతవకలపై గురువారం సాయంత్రం కరీంనగర్ కు చెందిన ఇన్ఫో సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై రవి కుమార్ వివరించారు.