వెయిటర్ రికార్డోకు 34 లక్షల టిప్

వెయిటర్ రికార్డోకు 34 లక్షల టిప్

మెక్సికో: జాత్యహంకార కామెంట్లను ఎదుర్కొన్న మెక్సికన్ రెస్టారెంట్ వెయిటర్ రికార్డోకు అమెరికా ప్రజల మద్దతు విశేషంగా లభిస్తోంది. యూఎస్‎కు చెందిన అతని పేరిట క్రౌడ్ ఫండింగ్ అకౌంట్‎ను క్రియేట్ చేయగా టిప్ రూపంలో లక్షలాది రూపాయలు జమయ్యాయి. ఈ నెల 2న ఒహియోలోని కాజులాస్ మెక్సికన్ కాంటినా రెస్టారెంట్‎లో భోజనం చేసిన మహిళ.. వెయిటర్ ఇచ్చిన బిల్లు స్లిప్​మీద ‘నీకు జీరో టిప్, యూఎస్​నుంచి మిమ్మల్ని ట్రంప్ బహిష్కరిస్తారని ఆశిస్తున్నా’ అని రాసి వెళ్లిపోయింది. 

ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు మహిళ పనిచేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీ ఆమెను ఉద్యోగంలోంచి తీసేసింది. ఇది జరిగిన తర్వాత మెక్సికన్ రెస్టారెంట్‎కు వచ్చే రెగ్యులర్ కస్టమర్ అన్నా ఓవర్ మన్.. వెయిటర్ రికార్డో పేరుమీద క్రౌడ్ ఫండింగ్ ఖాతా క్రియేట్ చేశాడు. నమ్మకస్తుడైన, హార్డ్ వర్కింగ్ సర్వెంట్ రికార్డోకు టిప్ ఇద్దామని పేర్కొన్నాడు. దీన్ని చూసిన వేలాది మంది అమెరికన్లు తలా కొంత టిప్ డొనేట్ చేశారు. అదికాస్తా సోమవారం నాటికి 
34.24 లక్షల రూపాయలకు చేరింది.