కాగజ్ నగర్, వెలుగు: లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నగదు తరలింపు విషయంలో నిబంధనలు పాటించాలని, రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సరైన డాక్యుమెంట్స్ ఉండాలని కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్ సూచించారు. ఆదివారం సిర్పూర్ టీ మండలం వెంకటరావు పేట్ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో సుమారు మూడున్నర లక్షలను పోలీసులు సీజ్ చేశారు.
కౌటాల మండలం మొగడ్ ధగడ్ గ్రామానికి చెందిన నరులే భరత్ అనే వ్యక్తి వద్ద రూ. 2 లక్షల 72 వేలు, ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్కు బొలెరో వాహనంలో వెళుతున్న ఇంద్రజిత్ రేణుకే వద్ద రూ.70 వేలు పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. కౌటాల సీఐ సాదిక్ పాషా, ఎస్ఐ దీకొంద రమేశ్, సిబ్బంది ఉన్నారు.