Zimbabwe: 20 ఓవర్లలో 344 పరుగులు.. అగ్రదేశాల రికార్డులు తుడిచిపెట్టేసిన జింబాబ్వే

Zimbabwe: 20 ఓవర్లలో 344 పరుగులు.. అగ్రదేశాల రికార్డులు తుడిచిపెట్టేసిన జింబాబ్వే

టీ20ల రాకతో ఆటతో వేగం పెరిగిందన్నది వాస్తవం. మ్యాచ్ ప్రారంభమైన తొలి నిమిషం నుంచే బంతికి.. బ్యాట్‌కు మధ్య యుద్ధం జరుగుతోంది.  ఒకప్పుడు 50 ఓవర్ల పాటు జరిగే వన్డే మ్యాచ్‌లో 200 పరుగులు చేస్తే గొప్ప అనేవారు. అలాంటిది టీ20లు వచ్చాక.. 20 ఓవర్ల మ్యాచ్‌లోనే 200.. 250.. 300 పైచిలుకు స్కోర్లు నమోదు అయ్యాయి. ఇది గతం.. ఇప్పుడు 340 పరుగులు దాటిపోయాం.. అంతటి భారీ రికార్డును జింబాబ్వే జట్టు నెలకొల్పింది.

ఏమి కొట్టుడు.. ఏమి కొట్టుడు.. 

పురుషుల టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌లో భాగంగా గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 344 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముగ్గురు జింబాబ్వే బ్యాటర్లు అర్ధశతకాలు సాధించగా, ఆ జట్టు కెప్టెన్ సికందర్ రజా(133 నాటౌట్) ఏకంగా భారీ సెంచరీ చేశాడు. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న సికందర్ రజా 15 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 133 పరుగులు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో జింబాబ్వే జట్టును ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చోబెట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యధిక స్కోర్. ఈ ఇన్నింగ్స్  దెబ్బకు పది రోజుల క్రితం భారత జట్టు చేసిన 297 పరుగుల భారీ స్కోర్ సైతం కనుమరుగైంది. 

ALSO READ | Sikandar Raza: శివాలెత్తిన సికందరుడు.. 33 బంతుల్లోనే శతకం

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఇన్నింగ్స్ స్కోర్లు

  • జింబాబ్వే: 344/4 vs గాంబియా (2024)  
  • నేపాల్: 314/3 vs మంగోలియా (2023)  
  • టీమిండియా: 297/6 vs బంగ్లాదేశ్ (2024)  
  • జింబాబ్వే: 286/5 vs సీషెల్స్ (అక్టోబర్ 2024) 
  • ఆఫ్ఘనిస్తాన్: 278 vs ఐర్లాండ్ (2019)  
  • చెక్ రిపబ్లిక్: 278/4 vs టర్కీ (2019)  
  • మలేషియా: 268/4 vs థాయిలాండ్ (2023)  
  • ఇంగ్లాండ్: 267/3 vs వెస్టిండీస్ (2023)  
  • ఆస్ట్రేలియా: 263/3 vs శ్రీ లంక (2016)  
  • శ్రీలంక: 260/6 vs కెన్యా (2007)