హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో మిస్సైన, దొంగిలించబడిన సెల్ ఫోన్లు రికవరీపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు పోలీసులు. అధునాతన టెక్నాలజీని వినియోగించి.. మొబైల్ పోయినా.. దొంగిలించబడినా.. వాటిన జాడను ఇట్టే పసిగట్టి రికవరీ చేస్తున్నారు. పొగొట్టుకున్న, లేదా దొంగిలించబడిన మొబైల్స్ ను తిరిగి ఓనర్స్ కు అందజేస్తున్నారు. గురువారం జూలై 25, 2024న సైబరాబాద్ పరిధిలోని పోగొట్టుకున్న మొబైల్స్ ని తిరిగి ఓనర్స్ కి అందజేశారు.
నెలరోజుల్లో సైబరాబాద్ పరిధిలో మిస్సయిన 345 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు పోలీసులు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా దొంగిలించబడిన, పోగొట్టుకున్న మొబైల్స్ ఆచూకీ గుర్తించి రికవరీ చేశారు. మీ మొబైల్ ఫోన్ పోయినా.. లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ లో గానీ, 1930 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా గానీ ఫిర్యాదు చేయాలని నగర ప్రజలకు సైబరాబాద్ పోలీసులు సూచించారు.