35 Chinna Katha Kaadu: సున్నాని దాటి గెలిచి తీరాలి..ఆలోచింపజేస్తున్న 35 చిన్న కథ కాదు ట్రైలర్‌‌‌‌

నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌‌టైనర్  ‘35-చిన్న కథ కాదు’.  రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 6న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.

ఆదివారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను హీరో నాగార్జున రిలీజ్ చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. మ్యాథ్స్ సబ్జెక్ట్‌‌తో ఇబ్బంది పడుతున్న ఓ స్టూడెంట్‌‌ని పరిచయం చేస్తూ మొదలైన ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.తల్లిదండ్రుల పాత్రలు పోషించిన నివేదా థామస్, విశ్వదేవ్ ఆ  పిల్లాడి భవిష్యత్ విషయంలో ఆందోళన పడుతుంటారు. ఆ పిల్లాడిని  ఫ్రెండ్స్, టీచర్స్ ‘సున్నా’ అని పిలుస్తుంటారు.

‘ఓడిపోవడం అనే మైనస్ నుంచి గెలవడం అనే ప్లస్ వైపు అడుగులు వేస్తుంటే అందరికీ ఎదురయ్యే మజిలీ సున్నా. ఆ సున్నాని మనం దాటాలి. గెలిచి తీరాలి’ అని నివేదా థామస్ చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తుంది.  విశ్వదేవ్, నివేదా థామస్ మధ్యతరగతి తల్లిదండ్రులుగా  నేచురల్ పెర్ఫార్మెన్స్‌‌తో ఆకట్టుకున్నారు.  ప్రియదర్శి, గౌతమి , భాగ్యరాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.