35 Chinna Katha Kaadu: ఇది మన కథ అనిపించే సినిమా ఇది: నిర్మాత సృజన్

35 Chinna Katha Kaadu: ఇది మన కథ అనిపించే సినిమా ఇది: నిర్మాత సృజన్

చక్కని కంటెంట్‌‌‌‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే సినిమాలు తీస్తానంటున్నారు నిర్మాత సృజన్ యరబోలు. రానా దగ్గుబాటి,  సిద్ధార్థ్​ రాళ్లపల్లితో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌‌‌‌లో నంద కిషోర్ ఈమాని డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సృజన్ ఇలా ముచ్చటించారు..

‘‘ఏదైనా ఓ క్లాసిక్ మూవీ తీయాలనుకునే టైమ్‌‌‌‌లో ఈ కథ విన్నా. ఇది క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం. మదర్ సెంటిమెంట్‌‌‌‌కి మించిన కమర్షియల్ ఎలిమెంట్ ఏదీ లేదు. ఇందులో నివేదాని చూస్తే మా అమ్మ గుర్తొచ్చింది. ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారు.  కథలోనే చాలా రిలేషన్‌‌‌‌షిప్స్, లేయర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఎలిమెంట్‌‌‌‌కి కనెక్ట్ అవుతారు. ‘ఇది మన కథ’ అనిపించే సినిమా ఇది.

పిల్లల కోసం ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌‌‌‌‌‌‌‌కి వెళ్లి పండగలా సెలబ్రేట్ చేసుకునే సినిమా. ఇండస్ట్రీలో కొందరు సినిమా చూసి చాలా గొప్పగా చెబుతున్నారు. ఇంత రెస్పాన్స్ మేం ఊహించలేదు. ప్రేక్షకుల నుంచి కూడా ఇదే స్థాయి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం ఉంది. తమిళంలో ‘మహారాజా’,  కన్నడలో ‘కాంతార’, మలయాళంలో ‘మంజుమ్మెల్ బాయ్స్‌‌‌‌’ ఎలా మెప్పించాయో తెలుగులో మా సినిమా ఆ స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’.